54 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు

కాగజ్ నగర్(CLiC2NEWS) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 54 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని గ్రంథాలయ పితామహుడు రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించచారు. కళాశాల రిటైడ్ ప్రిన్సిపాల్ రాంమోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైనారు. గ్రంథాలయ అధికారి దత్తాత్రేయ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డి, జనార్దన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ కళాశాల ప్రిన్సిపాల్ రాంమోహన్ రావు గ్రంధాలయ అధికారి దత్తాత్రేయ, ఇంచార్జి ప్రిన్సిపాల్ డి, జనార్దన్ మాట్లాడుతూ గ్రంధాలయం నందు విద్యార్థులకు కావలసిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రంధాలయాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన అని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రంథాల పట్ల మక్కువ చూపి జ్ఞానాన్ని పెంచుకోవాలి అని హితవు పలికారు. గ్రంథాలయాలు జ్ఞానాన్ని పెంచే దేవాలయాలు అని నేటి కంప్యూటర్ యుగంలో ఆధారణ తగ్గుతుండటంతో వాటికి ధీటుగా ప్రతి విద్యార్థి గ్రంధాలయాన్ని ఆదరించి పూర్వ వైభవాన్ని తేవడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు రాజశేఖర్, హతిరాం, కృష్ణవేణి, మధుకర్, రాజేశ్వర్, దుర్గం శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.