ఉత్కంఠ పోరులో కివీస్‌పై భారత్ ఘన విజయం

జైపూర్ (CLiC2NEWS): న్యూజీలాండ్‌తో సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భార‌త్ ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది. అశ్విన్‌, భువనేశ్వర్‌ రాణింపుతో కివీస్‌ను కట్టడి చేశారు. అశ్విన్‌(2/23), భువనేశ్వర్‌(2/24) రాణింపుతో కివీస్‌ 20 ఓవర్లలో 164/6 స్కోరు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌(70), మార్క్‌ చాప్‌మన్‌(63) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంత‌రం టీమ్ఇండియా 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవ‌ర్ల‌లో లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్‌ అర్ధసెంచరీతో రాణంచాడు.
బౌల్ట్‌ (2/31) రెండు వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలకమైన సూర్యకుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ శుక్రవారం రాంచీలో జరుగుతుంది.

న్యూజిలాండ్ బ్యాటింగ్‌:
గప్టిల్‌(సి)అయ్యర్‌(బి)చాహర్‌ 70, మిచెల్‌(బి)భువనేశ్వర్‌ 0, చాప్‌మన్‌(బి) అశ్విన్‌ 63, ఫిలిప్స్‌(ఎల్బీ)అశ్విన్‌ 0, సిఫెర్ట్‌(సి)సూర్యకుమార్‌(బి)భువనేశ్వర్‌ 12, రచిన్‌(బి) సిరాజ్‌ 7, సాంట్నర్‌ 4 నాటౌట్‌, సౌథీ 0 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 164/6; వికెట్ల పతనం: 1-1, 2-110, 3-110, 4-150, 5-153, 6-162; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-24-2, చాహర్‌ 4-0-42-1, సిరాజ్‌ 4-0-39-1, అశ్విన్‌ 4-0-23-2, అక్షర్‌పటేల్‌ 4-0-31-0.

భారత్ బ్యాటింగ్‌:
రాహుల్‌(సి)చాప్‌మన్‌(బి)సాంట్నర్‌ 15, రోహిత్‌శర్మ(సి)రవింద్ర(బి)బౌల్ట్‌ 48, సూర్యకుమార్‌యాదవ్‌(బి)బౌల్ట్‌ 62, పంత్‌ 17 నాటౌట్‌, అయ్యర్‌(సి)బౌల్ట్‌(బి)సౌథీ 5, వెంకటేశ్‌ (సి)రవీంద్ర(బి)మిచెల్‌ 4, అక్షర్‌పటేల్‌ 1 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 19.4 ఓవర్లలో 166/5; వికెట్ల పతనం: 1-50, 2-109, 3-144, 4-155, 5-160; బౌలింగ్‌: 4-0-40-1, బౌల్ట్‌ 4-0-31-2, ఫెర్గుసన్‌ 4-0-24-0, సాంట్నర్‌ 4-0-19-1, అస్టిల్‌ 3-0-34-0, మిచెల్‌ 0.4-0-11-1.

Leave A Reply

Your email address will not be published.