ధర్మపురి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

ధర్మపురి (CLiC2NEWS): హరిహర క్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకొని గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించారు. ధర్మపురి పట్టణానికి చెందిన మహిళలు వేకువజామున 4 గంటల నుంచే గోదావరి నది స్నానఘట్టాల వద్దకు చేరుకొని పవిత్రస్నానాలాచరించి గోదావరిలో దీపాలను వదిలి భక్తిప్రవత్తులు చాటుకున్నారు. అనంతరం భక్తులు ప్రధాన దేవాలయమైన లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంతో పాటు శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయం, శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీవేణుగోపాల స్వామివారి ఆలయంలో బారులు తీరారు.