`ఐవైయం లో చేరుదాం.. సమాజంలో నైతికతను తీసుకువద్దాం..`

మండపేట(CLiC2NEWS): సమాజ సేవలో పాలుపంచు కోవడానికి, ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ప్రతిఒక్కరు ఐడియల్ యూత్ మూవ్‌మెంట్ సంస్థలో చేరాలని ఐవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా పరిచయ ఉద్యమం చేపడుతున్నామని తెలిపారు. రండి ఐవైయం లో చేరుదాం…! సమాజంలో నైతికత ను తీసుకువద్దాం.. అనే నినాదంతో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం యువత సామాజిక చెడులకు బానిసలుగా మారిపోతున్నారని మద్యపానం, పోర్నగ్రాఫీ, జూదం, మత్తుమందు వంటి చెడులకు గురై తమ విలువైన యవ్వనాన్ని యువత నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతను చెడు వ్యసనాల నుండి రక్షించి వారిలో నైతికతను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఐవైయం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర కార్యదర్సి కలీమ్ మాట్లాడుతూ ఐడియల్ యూత్ మూవ్‌మెంట్ (ఐవైఎం) యువకుల్లో ధార్మిక చైత్యనం కలిగించడంతో పాటు వారిని ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని అన్నారు. ఐవైయం తన పని విధానంలో యువకుల నైపుణ్యాలను అభివృద్ది పరచి వారి ద్వారా సమాజంలోని చెడులను నిర్మూలించి మంచిని స్దాపించడం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమములో ఐవైఎం జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.