బిఎస్‌పి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షునిగా గడ్డం థామస్ ఎన్నిక

పెద్దపల్లి (CLiC2NEWS): బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షునిగా గడ్డం థామస్ జేమ్స్ ఎన్నికయ్యారు. ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన థామస్ జేమ్స్ ను ఎన్నుకున్నట్లుగా బిఎస్‌పి పార్టీ జిల్లా అధ్యక్షుడు డా.సదన్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షునికి,పార్టీ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో 85% ఉన్న బీసీ,Sc, St, మైనారిటీ బహుజనులు దశాబ్దాలుగా పాలితులుగా మిగిలిపోతున్నారు .15% కూడా లేనివారు దశాబ్దాలుగా పాలకులుగా కొనసాగుతున్నారు. కాబట్టే తెలంగాణ ప్రజల జీవితాలలో మౌళికమైన మార్పులు రావడంలేదు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డా.RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో BC ని MLA గా గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. దీనికి పెద్దపల్లి నియోజకవర్గంలోని బహుజనులంతా సహకరించి, బహుజన్ సమాజ్ పార్టీలో అధిక సంఖ్యలో చేరాలని కోరారు. థామస్ నియామకం పట్ల పలువురు విద్యావంతులు,బహుజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.