Jangaon: 64 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

జనగామ (CLiC2NEWS): జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పుగల్ గ్రామం వద్ద 64 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీలంలొ గ్రామ శివారులో డంప్ చేసిన 64 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వీటి వలువ రూ. 1.66 లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన కడమంచి ఉప్పలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.