క‌ర్న‌ల్ సంతోష్‌బాబుకు `మ‌హావీర్ చ‌‌క్ర`‌ పుర‌స్కారం

ఢిల్లీ(CLiC2NEWS): దేశ ర‌క్ష‌ణ‌లో ప్రాణ త్యాగం చేసిన క‌ర్న‌ల్ సంతోష్‌బాబుకు మ‌హావీర్ చ‌క్ర పుర‌స్కారం ల‌భించింది. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ బాబు స‌తీమ‌ణి, తల్లి మంగ‌ళ‌వారం పుర‌స్క‌రాన్ని అందుకున్నారు. న‌ల్గొండ జిల్లా సూర్యాపేట‌కు చెందిన సంతోష్‌బాబు కింద‌టేడాది భార‌త్‌-చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో చైనా సైనికుల‌తో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందారు. ఈ క్ర‌మంలో సంతోష్ బాబు స‌హా 21 మంది భార‌త సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు.
ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రిస్తూ మ‌ర‌ణానంత‌రం మ‌హావీర్ చ‌క్ర పుర‌స్కారాన్ని కేంద్రం ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.