దేశంలో 7 వేలకు దిగివచ్చిన రోజువారీ కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గాయి. 543 రోజుల కనిష్టానికి క్షిణించాయి. నిన్న 8 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య ఇవాళ తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 7,579 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
- గత 24 గంటల్లో కొత్తగా కరోనా బారినపడి 236 మంది మరణించారు.
- గత 24 గంటల్లో 12,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- ప్రస్తుతం దేశంలో 1,13,584 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.