సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

హైదరాబాద్ (CLiC2NEWS): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 115 పోస్టులు భర్తీ చేయనున్నది. వీటిలో ఐటి ఆఫీసర్, ఐటి, ఐటి సెక్యూరిటి అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్, డాటా సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి.
ఎకనమిస్ట్ 1, ఐటీ ఆఫీసర్ 1, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 15, డాటా సైంటిస్ట్ 1, క్రెడిట్ ఆఫీసర్ 10, డాటా ఇంజినీర్ 11, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్ 1, ఐటీ ఎస్‌వోసీ అనలిస్ట్ 2, రిస్క్ మేనేజర్ 15, టెక్నికల్ ఆఫీసర్ 5, ఫైనాన్షియల్ అనలిస్ట్ 20, లా ఆఫీసర్ 10, సెక్యూరిటీ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో సిఎ, ఐసిడబ్ల్యూఎ, ఎంబిఎ, పిజి, ఇంజినీరిగ్ చేసి ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబరు 7,2021. మరిన్ని వివారాలకు వెబ్‌సైట్ www.centralbankofindia.co.inచూడగలరు.