సినిమా టిక్కెట్ల అంశంపై పున‌రాలోచ‌న చేయాలంటూ చిరంజీవి ట్వీట్

హైద‌రాబాద్ (CLiC2NEWS): సినిమా టిక్కెట్స్ విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ తీరుపై చిరంజీవి అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రముఖ నటుడు చిరు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్ల‌ర్‌లో పోస్లు చేశారు.
‘‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత (Transparency) కోసం online ticketing బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం టికెట్ రేట్స్ ని కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే GST taxex ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది’’
అని చిరంజీవి పేర్కొన్నారు.

రోజుకి 4 ఆటలు మాత్రమే.. పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేదు.. అన్ని సినిమాలకు ఒకటే టికెట్ ధ‌ర‌.. మిడ్ నైట్ షోలు, బెన్‌ఫిట్ షోలు, స్పెషల్ షోలకు నో పర్మిషన్.. సామాజిక సేవాకార్యక్రమాలకు సంబంధించి నిధుల సేకరణ కోసమైతేనే బెన్‌ఫిట్ షోలకు అనుమతి అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే.

 

Leave A Reply

Your email address will not be published.