కిన్నెర మొగులయ్యకు సజ్జనార్‌ బంపర్‌ ఆఫర్‌

హైదరాబాద్ (CLiC2NEWS): కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు తెలంగాణ‌ ఆర్టీసీ ఉచిత బస్‌ పాస్ సౌక‌ర్యం కల్పించింది. ఈమ‌ధ్య కాలంలో మొగిల‌య్య ఆర్టీసీ బ‌స్సుల సేవలను కొనియాడుతూ పాట పాడారు. ఆ పాట‌కు సోష‌ల్ మీడియాతో మంచి స్పందన వ‌చ్చింది. లక్షకు పైగా వ్యూస్‌ రావటంతో దాన్ని ఆర్టీసీ సంస్థ‌ గుర్తించింది. సంస్థకు సానుకూల ప్రచారం చేసినందుకు మొగులయ్యను అభినందిస్తూ.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ బస్‌భవన్‌లో బుధవారం సన్మానించారు. ఆర్టీసీ బస్సుల్లో (కేటగిరీపై పరిమితితో) రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను మొగిలియ్య‌కు అందజేశారు. భవిష్యత్తులో ఆర్టీసీ సేవలను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎండీ సజ్జనార్ ఈ సంద‌ర్భంగా కోరారు.

కాగా ఇటీవల తన కూతురు వివాహానికి మొగులయ్య తెలంగాణ‌ ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సేవలను కొనియాడుతూ ఓ పాట పాడారు. ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.