AP: శాస‌నమండ‌లి డిప్యూటి ఛైర్‌ప‌ర్స‌న్‌గా జ‌కియాఖాన‌మ్

అమరావతి(CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. రాయ‌చోటి వైఎస్సార్‌సిసి ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ డిప్యూటి చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గౌర‌వ‌ప్ర‌థ‌మైన స్థానానికి తనను అర్హురాలుగా గుర్తించి పదవి ఇచ్చినందుకు సిఎం జగన్‌కు ఋణపడి ఉంటానన్నారు. ఒక సాధార‌ణ గృహిణిగా ఉన్న త‌న‌కు స‌ముచిత స్థానాన్ని క‌ల్పించినందుకు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మైనార్టీల సామాజిక‌, ఆర్ధిక‌, రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు కృషి చేస్తాన‌ని అన్నారు. ‌ శాస‌నమండ‌లి డిప్యూటి చైర్ ప‌ర్స‌న్‌గా ఎన్నికైన జ‌కియా ఖాన‌మ్‌కు సిఎం జ‌గ‌న్ అభినంద‌న‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.