తొలి ఒమిక్రాన్ సోకిన వ్య‌క్తిని కాంటాక్ట్ అయిన 5మందికి పాజిటివ్‌

బెంగ‌ళూరు(CLiC2NEWS): దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కర్ణాట‌క‌లో ఇద్దరు వ్య‌క్తుల్లో బ‌య‌ట‌ప‌డింది. ఆ ఇద్ద‌రికి సంబంధించిన వివ‌రాల‌ను బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక (బిబిఎంపి) క‌మిష‌న‌ర్ గౌర‌వ్ గుప్తా వెల్ల‌డించారు. తొలి వ్య‌క్తి గ‌త నెల 24వ తేదీన దుబాయి వెళ్లిపోయాడు. ద‌క్షిణాఫ్రికా నుంచి దుబాయి మీదుగా 66 ఏళ్ల వ్య‌క్తి నవంబ‌ర్‌20న కొవిడ్ నెగెటివ్ రిపోర్టుతో బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు వ‌చ్చాడు. అత‌నికి కొవిడ్ పాజిటివ్ గా నిర్థార‌ణ అయ్యింది. న‌వంబ‌రు 22వ తేదీన అత‌డి శాంపిల్స్‌ని జీనోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపారు. ఆ వ్య‌క్తి 27వ తేదీ అర్ధ‌రాత్రి క్యాబ్ తీసుకొని బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్క‌డి నుండి దుబాయికి వెళ్లిపోయాడు.
రెండో వ్య‌క్తి బెంగ‌ళూరుకు చెందిన 46 ఏళ్ల‌ వైద్యుడు. అత‌న‌కి గ‌త నెల 21న జ్వ‌రం రావ‌టంతో ఆర్టి-పిసిఆర్ ప‌రీక్ష చేయించుకున్నారు. శాంపిల్స్‌ను జీనోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపారు. న‌వంబ‌రు 25తేదీన ఆస్ప‌త్రిలో చేరారు. అత‌నితో ప్రైమ‌రీ కాంటాక్టులు, సెకండ‌రీ కాంటాక్టుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఐదుగురికి పాజిటివ్‌గా గుర్తించారు. వారంద‌రూ ఐసోలేష‌న్‌లో ఉన్నారని బిబిఎంపి క‌మిష‌న‌ర్ వివ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.