దేశంలో ఐదో ఒమిక్రాన్ కేసు నమోదు

ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ లో తొలి ఒమిక్రాన్ కేసు నిర్థారణ అయ్యింది. ఇప్పటికే దేశంలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ లో తొలి కేసు నమోదయ్యింది. ఇటీవల టాంజానియా నుండి ఇండియాకు వచ్చిన వ్యక్తి(37)కి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు నిర్థారించారు. బాధితుడు ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ (ఎల్ఎన్‌జెపి) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఇతనితో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు, ముంబయిలో ఒకటి, గుజరాత్లో ఒక కేసు నమోదయిన విషయం తెలిసినదే. బాధితులందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సనందిస్తున్నారని అధికారులు వెల్లడించారు.