చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి

చిత్తూరు(CLiC2NEWS) : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా ఐదుగురు మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని తిరుపతిలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగినపుడు కారులో 8మంది ఉన్నట్లు స్థానికులు తెపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.