నిమ్స్ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు

హైదరాబాద్(CLiC2NEWS) : నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆయన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిమ్స్‌లో ఆధునిక పరికరాల కోసం రూ.154 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ. 12 కోట్లతో వివిధ వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, పేషెంట్లకు ఉన్నత చికిత్సలు అందించే పరికరాలను ప్రారంభించామని తెలిపారు. రూ. 40 లక్షలతో అత్యాధునిక న్యూరో ఎండోస్కోపి పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. అదనంగా 200 ఐసియు బెడ్లు అందుబాటులోకి తీసుకొస్తామని, అవి జనవరి 15 వరకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.