శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని ‘సిరివెన్నెల’ పాట విడుదల

హైదరాబాద్(CLiC2NEWS) శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని సిరివెన్నెల.. అంటూ సాగే పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఆఖరి పాట అని చిత్ర బృందం తెలిపింది. ‘సిరివెన్నెల’ చిత్రంతోనే ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమయినదన్న విషయం తెలిసినదే. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంకు సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఒకటి ఈ రోజు విడుదలయింది. ఈపాటకు మిక్కీ జె.మేయర్ స్వరాలు అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. నాని కథానాయకుడుగా నటించిన ఈచిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటించారు. ఈచిత్రం డిసెంబరు 24వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.