నకిలీ వీసాలతో విమానాశ్రయంలో 44 మంది మహిళలు

హైదరాబాద్ (CLiC2NEWS): నకిలీ ధ్రవ పత్రాలు , వీసాలతో గల్ఫ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన 44 మంది మహిళలను అధికారులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు నకిలి వీసాలతో ఎయిర్పోర్టుకు వచ్చారు. వారిని ఆర్జీఐఎ అధికారులు పట్టుకున్నారు. కొంత మంది దళారులు డబ్బులు తీసుకొని నకిలి వీసాలు ధ్రవ పత్రాలు సృష్టించి శంషాబాద్ విమానాశ్రయం నుండి వారందరికీ టికెట్లు బుక్చేశారు. ఒకే దేశానికి రెండు వీసాలతో మహిళలు బయలుదేరారు. అవన్నీ నకిలీ వీసాలనే విషయాన్ని ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ వారిని ఇమిగ్రేషన్ అధికారులు ఆర్జిఐఎ పోలీసులకు అప్పగించారు.