`భీమ్.. ఈ న‌క్క‌ల వేట ఎంత‌సేపు..కుంభ‌స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొడ‌దాం ప‌దా..`

ఆర్‌.ఆర్‌.ఆర్‌. ట్రైల‌ర్‌.. రెండు క‌ళ్లూ చ‌ల‌వ్‌

ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌.. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం సినీ ప్రేక్ష‌లుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

`చిత్ర బృందం ఆర్‌.ఆర్‌.ఆర్‌.-రౌద్రం ర‌ణం రుధ‌దిరం` ట్రైల‌ర్‌ను విడుద చేశారు. ఇందులో విజువ‌ల్స్ స్ట‌న్నింగ్‌గాఉన్నాయి. ఒళ్లు గ‌గుర్పొడిచే యాక్ష‌న్ స‌న్నివేశాలు, రోమాలు నిక్క‌బొడిచే సీక్వెన్స్‌లు ఉన్నాయి. ప్ర‌తి భార‌తీయుడిలో ప్రేర‌ణ నింపేలా సాగిన డైలాగ్‌ల‌తో ట్రైల‌ర్ ఆద్యంతం అద‌ర‌హో అనేలా సాగింది.

అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ అద్భుతంగా న‌టించారు.
“భీమ్.. ఈ న‌క్క‌ల వేట ఎంత‌సేపు..కుంభ‌స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొడ‌దాం ప‌దా..“ అంటూ రామ్‌చ‌ర‌ణ్ చెప్పే డైలాగ్‌ప్రేక్ష‌కుల చేత చ‌ప్ప‌ట్లు కొట్టిస్తోంది.

3.07 నిమిషాల ఆర్‌.ఆర్‌.ఆర్‌. ట్రైల‌ర్ చూస్తే బాక్సాఫీస్ వ‌ద్ద రాజ‌మౌళి సంచ‌ల‌నాలు క్రియేట్ చేయ‌డం ఖాయంగా అనిపిస్తోంది. సుమారు రూ. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై దాన‌య్య‌నిర్మించారు. సంగీతం కీర‌వాణి అందించారు. పాన్ ఇండియా సినిమా నిర్మిత‌మైన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

Leave A Reply

Your email address will not be published.