జిఓ నంబ‌ర్ 59 ఉప‌సంహర‌ణ.. ఎపి ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

అమ‌రావ‌తి(CLiC2NEWS): జిఓ నంబ‌ర్ 59ను ఉప‌సంహ‌రించుకుటున్న‌ట్టు ఎపి ప్ర‌భుత్వ న్యాయ‌వాది హైకోర్టుకు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వార్డు, మ‌హిళా కార్యద‌ర్శుల‌ను, మ‌హిళా పోలీసులుగా నియ‌మిస్తూ గతంలో జారీ చేసి జిఓ నంబ‌ర్ 59 ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జిఓ నంబ‌ర్ 59పై దాఖ‌లైన వ్యాజ్యాల విచార‌ణ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తెలిపింది. ఈ విష‌యంలో డ్రెస్‌కోడ్ కూడా ఉప‌సంహారించుకొంటున్న‌ట్టు చెప్పారు. మ‌హిళా పోలీస్ సేవ‌ల‌ను ఏవిధంగా వినియోగించుకోవాల‌నే విష‌యంపై ప్ర‌భుత్వం చ‌ర్చ జ‌రుపుతుంది. దీనిగురించి పూర్తి వివ‌రాల‌తో అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తామ‌ని హైకోర్టుకు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.