స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. విపక్షాలు పోటీ ఇవ్వలేకపోయాయి. మొత్తం 12 స్తానాల్లో ఇప్పటి 6 ఆరు స్థానాలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసింది. మరో ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఆరు స్థానాల్లో కూడా టిఆర్ ఎస్ పార్టీ కి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు.
- కరీంనగర్: మ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో ఎల్. రమణ, భానుప్రసాద్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రమణకు 479 ఓట్లు, భాను ప్రసాద్‌కు 584 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
- ఆదిలాబాద్: జిల్లాలో దండె విఠల్ గ667 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- ఖమ్మం: జిల్లాలో టిఆర్ ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపొందారు.
- నల్లగొండ: జిల్లాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థి 691 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- మెదక్: జిల్లాలో అధికార టిఆర్ ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి యావరెడ్డి 524 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.