తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్(CLiC2NEWS) : తెలంగాణ రాష్ట్రంలో రెండు కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నిర్థారణయ్యాయని ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఇటీవ ల కెన్యా, సోమాలియా నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ లాబ్‌కు పంపగా ఒమిక్రాన్ సోకినట్టు నిర్థరణయ్యిందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కెన్యానుండి వచ్చిన మహిళ (24)కు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్థారణ అయ్యిందని, ఆమెకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల శాంపిల్స్ కూడా టెస్ట్‌కు పంపినట్లు తెలిపారు. సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్ నిర్థారణ అయ్యిందని , వ్యక్తిని గుర్తించి త్వరలో టిమ్స్‌కు తరలిస్తామని వెల్లడించారు.
ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, కేవలం రెండురోజుల్లో డబుల్ అయ్యే సామర్థ్యం ఉందని అన్నారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరంలేదు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ప్రజలందరూ కరోనా నింధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.