మృత్యువుతో పోరాడి ఓడిన వీరుడు
కెప్టన్ వరుణ్‌సింగ్ కన్నుమూత..

బెంగళూరు (CLiC2NEWS): ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ కన్నమూశారు. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో బిపిన్ రావత్ దంపతులతో సహా 13మంది మృతిచెందిన విషయం తెలిసినదే. ఆ ప్రమాదంలో తీవ్రగాయాలై బెంగళూరులోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌సింగ్ బుధవారం ఉదయం మృతిచెందినట్లు భారత వాయుసేన (ఐఎఎఫ్) ప్రకటించింది.
కెప్టెన్ వరుణ్‌సింగ్ మృతిపట్ల భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. “దేశానికి ఎనలేని సేవ చేశారని, ఆయన సేవ ఎప్పటికి మరువలేనిదని ప్రధానమంత్రి అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా” అని మోడి ట్వీట్ చేశారు.