వృద్ధాప్య పింఛన్ రూ.2500కు పెంపు: సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుండి వృద్ధాప్య పింఛన్లను రూ.2500 అందించనున్నారు. ఎపి ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే పింఛన్‌లను రూ.2,250 నుండి రూ.2,500కు పెంచినట్లు సిఎం జగన్ వెల్లడించారు. అదేవిధంగా నిరుపేద మహిళలకు సంవత్సరానికి రూ. 15వేలు చొప్పున మూడు సంవత్సరాలు అందిస్తామన్నారు. మూడోవిడత రైతు భరోసా నిధులు జనవరిలో చెల్లిస్తామని తెలియజేశారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు-ఒటిఎస్ పథకంలో రూ. 10వేల కోట్ల భారీ రుణాలను ప్రభుత్వం మాఫీచేస్తుంది.ఆస్తిపై పూర్తి హక్కులు కల్పిస్తోంది. రూ.5 లక్షల నుండి రూ. 10 లక్షలు ధర ఉన్నవాటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని తెలియజేశారు.