దేశంలో కొత్త‌గా 6,563 కేసులు

న్యూడిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఆదివారం ఏడు వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదవ్వ‌గా.. తాగాజా గ‌డిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 6,563 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 132 మంది మ‌ర‌ణించారు. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3,47,46,838 కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం దేశంలో 82,267 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 8077 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.