15 నిమిషాల్లో రూ. 5.2 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబయి (CLiC2NEWS): దేశీయ మార్కెట్లపై బేర్ పట్టు భిగించింది. ఇవాళ (సోమవారం) స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంతోనే మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. ఐరోపాలో ఒమిక్రాన్ వేరియంట్ భయాలు.. మరోవైపు సర్కార్ నిర్ణయాలు సూచీలను కుదిపివేశాయి. దీనికి తోడు అంతర్జాతీయ ప్రమాణాల ప్రతికూల సంకేతాలు మార్కెట్లను మరింత దెబ్బకొట్టాయి. దీంతో సూచీలు సోమవారం నాటి ట్రేడింగ్‌ను భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ 1408 పాయింట్అల నష్టపోయి 55,602 వద్ద ట్రేడవుతున్నది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ సూతం నష్టాల బాటలోనే కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నానికి 435 పాయింట్లు కోల్పోయి 16,549 వద్ద ట్రేడవతున్నది. దీంతో కేవలం 15 నిమిషాల వ్యవధిలో రూ. 5.2 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.