తండ్రికి తగ్గ తనయుడు సిఎం జగన్ : హీరో సుమన్

గుంటూరు(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా గుంటూరులోని నిర్మల హృదయ భవన్లో వికలాంగులకు పేదలకు పండ్లు దుప్పట్లు, దుస్తులు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఎపి హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మల్యే నంబూరు శంకర్రావు, హీరో సుమన్ పాల్గొన్నారు. సిఎం వైఎస్ జగన్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని హోంమంత్రి సుచరిత ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పలు ముఖ్యమంత్రుల పనితీరు పరిశీలించానని.. వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఆయన తనయుడు జగన్ అంతకంటే ఎక్కవ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.