పెద్దపల్లి జిల్లాలో లారీ ఢీకొని.. ముగ్గురి మృతి

పెద్దపల్లి (CLiC2NEWS): పెద్దపల్లి జిల్లలో లారీ ఆటోపై పడి ఘోర ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో చిన్నరితో సహా ముగ్గురు మృతిచెందారు. జిల్లాలోని గోదావరిఖని గంగానగర్ వద్ద రెండులారీలు ఢీకొని ప్రక్కన వెళ్తున్న ఆటోపై పడ్డాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురుమృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.