తెలంగాణలో 24కి చేరిన ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో తాజాగా 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 24కి చేరింది. గడిచన 24గంటలలో విదేశాల నుండి 726 మందిశంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారందరికి కొవిడ్ ఆర్టిపిసిఆర్ టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్ గా నిర్ధారణయ్యింది.
రాష్ట్రంలో 24 గంటల్లో 39,919మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి నుండి కోలుకుని 188 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,625 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.