క్రిస్మస్ వేడుకల్లో సిఎం కెసిఆర్..

హైదరాబాద్(CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెసిఆర్‌తో పాటు హరీశ్‌రావు, మహమూద్ ఆలీ, కొప్పుల ఈశ్వర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హజరయ్యారు. సిఎం కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మతాల వారికి రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. మతపరమైన దాడులకు పాల్పడిన వారిని సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ముందుకు సాగాలని అన్నారు.