కళ్యాణానికి వేదికైన నిత్యాన్నదాన సత్రం
24 జంటలకు వివాహం జరిపించిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు

కాగజ్ నగర్ (CLiC2NEWS): ప్రతి ఏటా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు పలు జంటలకు వివాహాలు జరిపించి పెళ్లికి కావాల్సిన అన్ని సమకూర్చి పేదింటి పెళ్లికి పెద్దన్నలా నిలుస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలో ప్రతి నిత్యం ప్రజల ఆకలి తీర్చేందుకు నిత్యాన్నదాన సత్రం ప్రారంభించి రాష్ట్ర స్థాయిలోనే అందరి నోట అన్నదాత గా పేరు సంపాదించారు.
ఎమ్మెల్యే ప్రారంభించిన నిత్యాన్నదాన సత్రంలో శుక్రవారం పలు జంటలకు వివాహాలు జరిపించడమే కాకుండా పెళ్లికి కావాల్సిన సామాగ్రి కానుకలు నూతన వధూవరులకు అందజేశారు.. నిత్యాన్నదాన సత్రంలో నియోజకవర్గానికి చెందిన 24 జంటలకు నిత్యాన్నదాన సత్రంలో వేద మంత్రోచ్చరణాల మధ్య నూతన జంటలకు వివాహాలు జరిపించిన ఎమ్మెల్యే దంపతులు నూతన జంటలను ఆశీర్వదించారు.. వివాహాలు జరిపించడమే కాకుండా వివాహానికి వసరమైన పుస్తెలు మట్టెలు నూతన పట్టు వస్త్రాలు పెళ్లి సామాగ్రి కానుకలను నూతన జంటలకు అందజేశారు..