వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం..
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు

సిద్ధిపేట (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం తరుపున కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మతో మల్లన్న కల్యాణం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రులు తసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఎంపి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ఈ కార్యాపాల్గొన్నారు. భక్తులు స్వామి వారి కల్యాణానికి భారీగా తరలివచ్చారు.