ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. థియేటర్లు మూసివేత.. మరిన్ని ఆంక్షలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీ లో ఆంక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. సర్కార్ జారీ చేసి ఆంక్షలు బుధవారం నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించారు.
ఎల్లో అలర్ట్‌లో భాగంగా థియేటర్లు, మల్టీఫెక్స్‌లు మూతపడనుండగా.. రెస్టారెంట్లు మాత్రం 50 శాతం కెపాసిటీతో నిర్వహించేదుకు అనుమతివ్వనున్నారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. స్పాలు, జిమ్‌లు, యోగ ఇనిస్టిట్యూషన్స్ మూతపడనున్నాయి.
ఢిల్లీలో ఆంక్షల వివరాలు..
- సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్‌లు, ఆడిటోరియంలను మూసివేస్తారు.
- జిమ్‌లు, స్పా సెంటర్లు, యోగా ఇనిస్టిట్యూట్‌లు మూతపడతాయి.
- స్కూళ్లు, విధ్యా సంస్థలు తెరవడానిక అనుమతి లేదు
- రాజకీయ, సామాజిక, మత పరమైన కార్యక్రమాలు, సభలు సమావేశాలు నిషేధం.
- హోటళ్లు తెరుచుకోవచ్చు.. కానీ బాంకెట్ హాల్స్, కాన్ఫరెన్స్ హాళ్లను తెరిచేందుకు అనుమతి లేదు..
- రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో ఉ.. 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరుచుకోవచ్చు.
- బార్లు 50 శాతం సామర్థ్యంతో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటలవరకు అనుమతి
- మెట్రో 50 శాతం సామర్థ్యంతో నడవాలి, బస్సుల కూడా 50 శాతం సామర్థ్యంతోనే నడవాలి
- ఆటోలు, టాక్సీలలో ఇద్దరికి మాత్రమే అనుమతి
- రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ