ప్రధానమంత్రి మోడితో ఎపి సిఎం జగన్ భేటీ..

ఢిల్లి (CLiC2NEWS): ప్రధానమంత్రి మోడితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పెండింగ్ సమస్యలను ప్రధానితో జగన్ చర్చించారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర విభజనతో ఎపి ఆర్థిక ప్రగతి దెబ్బతిన్నదని, విభజన సమయంలో 58% జనాభా ఎపికి రాగా.. 45% రెవెన్యూ మాత్రమే దక్కిందని ప్రధానికి వివరించారు. భౌగోళికంగా చూస్తే తెలంగాణ కన్నా ఎపి పెద్దదని, జనాభా కూడా ఎక్కవ, ప్రజల అవసరాలకు అదేస్థాయిలో వ్యయం చేయాల్సిఉంటుంది. విభజన వల్ల రాజధానిని కూడా ఎపి కోల్పోయింది. వాటికోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. విభజన సమయంలో ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుందని ప్రధానికి వివరించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ. 2,100 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేసేలా ఆర్థిక శాఖలకు ఆదేశాలు ఇవ్రాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఎపి జెన్‌కో విద్యుత్‌ను కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు పంపిణీ చేసింది. దీనికోసం రూ 6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అర్హత ఉన్న చాలా మందిజాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధి పొందడంలేదు. ఈ విషయంలో జోక్యం చేసుకొని తగిన కేటాయింపులు చేయలని కోరుతున్నాం.
కేంద్ర ప్రభుత్వం నుండి రావల్సిన పన్నుల ఆదాయం తగ్గుతూ వస్తోంది. ఈ ఆదాయం గత రెండు శతాబ్దాలలో కేంద్రం నుండి వచ్చే పన్నుల ఆదాయం అతి తక్కవ నమోదయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా ప్రజారోగ్యం దృష్ట్యా విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయం, గృహ నిర్మాణం తదితర రంగాల్లో వివిధ కార్యాక్రమాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సిఎం జగన్‌మోహనరెడ్డి వివరించారు.