రెండోసారి కూడా ఆడ‌పిల్ల పుడుతుందేమోన‌ని గ‌ర్భిణి ఆత్మ‌హ‌త్య‌..

మంచిర్యాల‌ (CLiC2NEWS): మంచిర్యాల‌ ప‌ట్ట‌ణంలో నిండు గ‌ర్భిణి ఆత్య‌హ‌త్యకు పాల్ప‌డింది. త‌న‌కు మ‌ర‌ల ఆడ‌పిల్ల పుడితే అత్తింటి వారు ఏమ‌నుకుంటారోన‌ని ఆందోళ‌న‌తో ఆత్య‌హ‌త్యకు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్‌టిఆర్ న‌గ‌ర్‌కు చెందిన ఎగ్గెన ఆనంద్‌తో దెండెప‌ల్లి మండ‌లం న‌ర్స‌పూర్‌కు చెందిన ర‌మ్య(25)కు నాలుగు సంవ‌త్స‌రాల‌కింద‌ట వివాహ‌మైంది.

వీరికి మూడేళ్ల కుమార్తె (ఆరాధ్య)ఉంది. గ‌త 9 నెల‌ల కింద‌ట ర‌మ్య మ‌ళ్లీ గ‌ర్భం దాల్చ‌డంతో భ‌ర్త మంచిర్యాల‌లోని ఒ ప్రైవేటు ద‌వాఖానాలో వైద్య ప‌రీక్షలు చేయిస్తున్నాడు. డాక్ట‌ర్ ఈ నెల 6 (గురువారం)వ తేదీన డెలివ‌రీ డేట్ ఇచ్చారు. గురువారం కాన్పుకోసం ఆసుప‌త్రికి వెళ్లాల్సిన ర‌మ్య‌. .. త‌న‌కు ఆడ‌పిల్ల పుడితే అత్తింటివారు ఏమ‌నుకుంటారోన‌ని ఆందోళ‌న చెందిన బుధ‌వారం రాత్రి ఇంట్లో ఎవ‌రూ లేకపోవ‌డంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరిపోసుకుంది.

కాగా పోస్టుమార్టం రిపోర్టులో ర‌మ్య గ‌ర్భంలో ఉన్న‌ది మ‌గ‌పిల్లాడ‌ని తేల‌డంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.