హైదరాబాద్‌లో నుమాయిష్ రద్దు..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో జనవరి 1న ప్రారంభించిన నుమాయిష్ కరోనా కారణంగా రద్దచేశారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అఖిల భారత పారిశ్రమిక వస్తు ప్రదర్శన (నుమాయిష్)ను రద్దు చేయలని పోలీసు కమిషనర్ కార్యాలయం ఎగ్జిబిషన్ సొసైటీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే నుమాయిష్‌లో సందర్శనను నిలిపివేశామని, తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎగ్జిబిషన్‌ను మూసివేస్తున్నట్లు సొసైటి ప్రకటించింది. నుమాయిష్ రద్దు కావడంతో దుకాణదారులనుండి తీసుకున్న డబ్బులను తిరిగిచెల్లించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటి తెలిపింది. అయితే వారు డబ్బులు ఇవ్వకపోయినా అభ్యంతరం లేదని, వచ్చే సంవత్సరం నుమాయిష్‌కి దుకాణాలు పెట్టుకుంటామని కోరారాని సొసైటి పేర్కొన్నది. ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన దుకాణదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొవిడ్ టీకా సెంటర్‌తో పాటు వారకి భోజన సదుపాయాలు చేస్తున్నట్లు తెలిపారు.