ఉద్యోగుల‌కు 23 శాతం ఫిట్‌మెంట్‌!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపి సిఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పారు. ఫిట్మెంట్‌ను 23 శాతంగా సిఎం ప్ర‌క‌టించారు. ఉద్యోగుల రిటైర్ మెంట్ వ‌యస్సు 60 నుంచి 62 యేళ్ల‌కు పెంచుతూ ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకున్నారు.

  • పెంచిన కొత్త జీతాలు జ‌న‌వ‌రి 1, 2022 నుంచి చెల్లించ‌నున్నారు.
  • పీఆర్సీ అమ‌లు జూలై 1, 2018 నుంచి అమ‌లు కానింది.
  • మానిట‌రీ బెనిఫిట్ అమ‌లు ఏప్రిల్ 1 వ తేదీ 2022 నుంచి అమ‌లు కానుంది.
  • ఈ నిర్ణ‌యంతో స‌ర్కార్‌పై రూ. 10,247 కోట్ల భారం ప‌డ‌నుంది.
Leave A Reply

Your email address will not be published.