ఇటలీ నుండి వచ్చిన విమానంలో 173 మందికి కరోనా!

అమృత్‌సర్ (CLiC2NEWS): ఇటలీ నుండి భారత్‌కు వచ్చిన విమానంలో 173 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. విదేశాలనుండి వస్తున్న విమానాల్లోని ప్రయాణికులకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించాగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటలీ నుండి శుక్రవారం అమృత్‌సర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన విమానంలో 290 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరికి ఎయిర్‌పోర్టులో నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 173 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిన్న ఇటలీ నుండి ఇదే విమానాశ్రయానికి వచ్చిన 125 ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. వీరందరికీ అమృత్‌సర్‌లోని పలు ఆసుపత్రులలో ఐసోలేషన్‌వార్డులకు తరలించారు.