ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలు ఖరారు..
కన్వీనర్ల నియామకం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఎంట్రన్స్ ఎక్జామ్స్ నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కన్వీనర్లను కూడా నియమించింది. జెఎన్‌టియుహెచ్‌కు ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యతను అప్పగించింది. టిఎస్ ఐసెట్‌ను కాకతీయ యూనివర్సిటీకి అప్పగించింది. టిఎస్ పిజిఈసెట్, టిఎస్ ఎడ్‌సెట్, టిఎస్‌లాసెట్, టిఎస్ పిజిఎల్‌సెట్ నిర్మహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు.
టిఎస్ ఎమ్‌సెట్ కన్వీనర్ – ప్రొఫెసర్ ఎ గోవర్ధన్ (జెఎన్టియూహెచ్)
టిఎస్ ఈసెట్ కన్వీనర్ – ప్రొఫెసర్ కె విజయ్ కుమార్ రెడ్డి (జెఎన్టియూహెచ్)
టిఎస్ ఐసెట్ కన్వీనర్ -ప్రొఫెసర్ కె రాజిరెడ్డి (కాకతీయ యూనివర్సిటి)
టిఎస్ పిజిసెట్ కన్వీనర్ – ప్రొఫెసర్ పి లక్షీనారాయణ(ఒయు రిజిస్టార్)
టిఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్ – ప్రొఫెసర్ ఎ రామకృష్ణ (ఒయు)
టిఎస్ లాసెట్, టిఎస్ పిజిఎల్‌సెట్ కన్వీనర్ _ ప్రొఫెసర్ జిబి రెడ్డి (పిజిఆర్ ఆర్ డైరెక్టర్)