కారుణ్య నియామకాలపై కీలక ఆదేశాలు: సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కారుణ్య నియామకాలపై కీలక ప్రకటన చేశారు. గతంలోఇచ్చిన హామీకి అనుగుణంగా కరోనా కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలలోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ 30 లోగా ఈ నియామకాలు పూర్తి చేయాలని అధికారులకు సిఎం ఆదేశాలు జారీ చేశారు.