`రైలు గార్డు` కాదు.. ఇక `ట్రైన్ మేనేజర్`.. రైల్వేశాఖ వెల్లడి
న్యూఢిల్లీ (CLiC2NEWS): రైలు గార్డు అని ఇక పిలవొద్దని.. ఇకపై వారిని ట్రైన్ మేనేజర్ గా పలిలవాలని రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు `గార్డ్` పోస్టును `ట్రైన్ మేనేజర్` గా మార్చాలని గురువారం రైల్వే శాఖ నిర్ణయించింది.
అసిస్టెంట్ గార్డ్‌ను అసిస్టెంట్ పాసింజర్ ట్రైన్ మేనేజర్‌గా, గూడ్స్ గార్డ్‌ను గూడ్స్ ట్రైన్ మేనేజర్‌గా, సీనియర్ గూడ్స్ గార్డ్‌ను.. సీనియర్ గూడ్స్ మేనేజర్‌గా, సీనియర్ పాసింజర్ గూడ్స్గార్డును సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్‌గా, సీనియర్ పాసింజర్ గార్డ్‌ను సీనియర్ పాసింజర్ ట్రైన్ మేనేజర్‌గా పేర్కొంది. ఈ మేరకు గురువారం ఉత్వర్తువు జారీ చేసింది.