సంక్రాంతి ఎఫెక్ట్.. బోసిపోయిన భాగ్యనగరం..
హైదరాబాద్ (CLiC2NEWS): ఉరుకులు పరుగులతో.. రాత్రి పగలు అని అని తేడా లేకుండా ఎప్పుడూ బిజీబిజీగా ట్రాఫిక్‌తో ఉండే భాగ్యనగరం వీధులు ఇప్పుడు బోసిపోయాయి. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వేళ పట్టణవాసి పల్లెబాట పట్టాడు.. దాంతో నగరంలోని రహదారులు వెలవెలబోతున్నాయి. నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే కూడళ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జిల్లాలకు వెళ్లే రహదారులు ట్రాఫిక్‌తో నిండిపోయాయి. పంతంగి టోల్ గేట్ వద్ద బారీగా వాహనాలు బారులు తీరాయి.
ఆరుగాలం కష్టపడిన రైతన్న కష్టం ఇంటికి వచ్చే రోజే సంక్రాంతి పండుగగా అందరూ చెప్పుకుంటారు. ఇది తెలుగువారి అతిముఖ్యమైన పండుగలలో సంక్రాంతికి పత్యేక స్థానం ఉంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేసి ఉత్సాహంగా గడుపుతారు.