రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురి మృతి
మదనపల్లె (CLiC2NEWS): రెండు ద్విచక్రవాహనాలు ఢికొని ముగ్గురు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు ఆసుపత్రిలోచికిత్స పొందుతూ ఇవాళ (శనివారం) తెల్లవారు జామున మృతిచెందారు.
మదనపల్లె పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
జిల్లాలోని వాల్మీకిపురం మండలం చంతపర్తి విలేజ్ కి చెందిన ఇస్మాయిల్ (21), అతని మిత్రుడు సిద్దిక్ (21) మనపల్లె నుంచి ద్విచక్రవాహనంపై చింతపర్తికి బయలు దేరారు. దారిలో మదనపల్లె ఐదో మైలుకు వద్దకు రాగానే మరో ద్విచక్రవాహనం ఎదురుగా రావడంతో రెండు వాహనాలు ఒకదానికి ఒకటి బలంగా ఢి కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులతో పాలు మరో ద్విచక్రవహనంపై ఉన్న కొత్తవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు (41) తీవ్రంగా గాయపడ్డారు. కాగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో శ్రీనివాసులు మృతి చెందారు. మిగతా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తిరుపతిలో ని రుయా ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతూ ఇవాళతెల్లవారుజామున మృతిచెందారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.