రాష్ట్రవ్యాప్తంగా ‘ద‌ళిత‌బంధు’ అమ‌లుకు క‌లెక్ల‌ర్ల‌కు ఆదేశాలు..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణలో రాష్ట్రమంతా ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. వాసాలమర్రి, హుజూరాబాద్‌లో పూర్తి స్థాయిలో ఈప‌థ‌కం అమ‌లులో ఉన్న విష‌యం తెలిసిన‌దే. మ‌రోనాలుగు మండ‌లాల్లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాలోని చింత‌కాని, సూర్యాపేట జిల్లా తిరుమ‌ల‌గిరి, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా చార‌గొండ‌, కామారెడ్డి జిల్లా నిజాంసాగ‌ర్ మండ‌లాలు ఉన్నాయి. ఈమేర‌కు సిఎస్ సోమేశ్‌కుమార్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌, సిఎస్ సోమేశ్‌కుమార్, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని 118 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో, ప్ర‌తి నియోజ‌క వ‌ర్గంలో 100 మంది ల‌బ్ధిదారుల‌ను ఎంపిక‌చేయాలి మార్చి నెల‌లోపు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 100 కుటుంబాల‌కు ద‌ళితబంధు ప‌థ‌కాన్ని అమ‌లుచేయాలి. దీనికోసం స్థానిక శాస‌న‌స‌భ్యుల స‌ల‌హాతో ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసి న జాబితాను జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రుల‌తో ఆమోదించుకోవాలి. ప్ర‌తి ల‌బ్ధిదారుడికి బ్యాంకు లింకేజి లేకుండా రూ. 10 ల‌క్ష‌ల ఆర్ధిక సాయంతో కోరుకున్న యూనిట్‌ను ఎంపిక చేయాలి. 118 నియోజ‌క వ‌ర్గాల్లో పథ‌కం అమ‌లుకోసం రూ. 1,200 కోట్లు కేటాయించారు. దీనిలో ఇప్ప‌టికే రూ 100కోట్లు విడుద‌ల చేశారు. మిగ‌తా మొత్తాన్ని ద‌శ‌ల వారీగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సిఎస్ వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.