TS: రాష్ట్రంలో జ‌న‌వ‌రి 24 నుండి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పాఠ‌శాల విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణ‌యించింది. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా సెల‌వులు ఈనెల 30 వ‌ర‌కు పొడిగొంచిన విష‌యం తెలిసిన‌దే. ఈనెల 24వ తేదీనుండి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోని 8,9,10 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు అన్‌లైన్ ద్వారా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. పాఠ‌శాల‌ల‌కు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేత‌ర సిబ్బంది సైతం రొటేష‌న్ ప‌ద్ధ‌తిలో 50% మంది మాత్ర‌మే విధుల‌కు హాజ‌రుకావాల‌ని తెలిపింది. ఈమేర‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.