నేతాజీకి ఘ‌న నివాళి..

ఈ ఏడాది నుండి గ‌ణ‌తంత్ర దినోత్స‌వాలు జ‌న‌వ‌రి 23 నుండి ప్రారంభం

సుభాష్ చంద్ర‌బోస్ 125వ జ‌యంతి వేడుక‌ల‌ను దేశ‌మంతా ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. స్వాతంత్ర‌ స‌మ‌ర‌యోధుడు, ఆజాద్‌హింద్ ఫౌజ్ వ్య‌వ‌స్థాప‌కుడు అయిన ‘నేతాజీ’ జ‌యంతి సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఈ సంవ‌త్స‌రం నుండి గ‌ణ‌తంత్ర దినోత్స‌వాల‌ను జ‌న‌వరి 23 నుండి ప్రారంభించ‌నున్నారు. గ‌త సంవ‌త్స‌రం నుండి నేతాజీ జ‌యంతిని కేంద్ర ప్ర‌భుత్వం ‘ప‌రాక్ర‌మ్ దివ‌స్‌’గా నిర్వ‌హిస్తోంది.

నేతాజీకి భార‌త‌దేశం కృత‌జ్ఞ‌తాపూర్వ‌క నివాళుల‌ర్పిస్తోంద‌ని భార‌త రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి దేశ ప్ర‌జ‌ల‌కు ‘ప‌రాక్ర‌మ్ దివ‌స్’ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దేశానికి నేతాజి అందించిన సేవ‌ల‌కు ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్విస్తున్నాడు అని ట్వీట్ చేశారు. ఆయ‌న ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద ‘బోస్ హోలోగ్రామ్’ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. అనంత‌రం ‘సుభాష్ చంద్రబోస్ ఆప‌ద ప్ర‌బంధ‌న్’ అవార్డుల‌న ప్ర‌దానం చేయ‌నున్నారు..

 

Leave A Reply

Your email address will not be published.