నగర శివారు ప్రాంతాల నీటి సరఫరాకు రూ.6 వేలకోట్లు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉందని.. కానీ హైదరాబాద్‌కు మాత్రమే అన్ని కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. ఏప్రాజెక్టునైనా వచ్చే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. మణికొండ అల్కాపురి టౌన్‌షిప్‌లో ఓఆర్ ఆర్ ఫేజ్ -2 నీటి సరఫరా పనులకు సోమవారం మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాటీలు ఇప్పటికే నగరంతో కలిసిపోయాయి. ఒర్ ఆర్ పరిధిలోని గ్రామాలనుహైదరాబాద్‌లో భాగంగా భివిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనమైన అన్ని గ్రామాలకు నీరు అందిస్తాం. రూ. 1200 కోట్ల వ్యయంతో ఆర్ ఆర్ పరిధిలోని ఇళ్లకు నీటి సరఫరా చేస్తాం. నగర శివారు ప్రాంతాల నీటి సరఫరా కోసం రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొండ పోచమ్మ సాగర్ నీటితో గండిపేట చెరువును నింపాలనేది ముఖ్యమంత్రి ఆలోచన“ అని మంత్రి కెటిఆర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.