Republic Day: 939 గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ (CLiC2NFEWS): గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ భద్రతలో అలుపెరగని ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు శౌర్య పురస్కారలు అందజేస్తారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కేంద్ర సర్కార్ గ్యలంటరీ అవార్డులను ప్రకటించింది. 939 మంది పోలీసులు సిబ్బందిని గ్యాలంట్రీ అవార్డులతో సత్కరించనున్నారు.
వీరిలో అత్యధిక శౌర్య పతకాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు 115, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి 30, ఛత్తీస్‌గఢ్ పోలీసులకు 10, ఒడిశా పోలీసులకు 9, మహారాష్ట్ర పోలీసులకు ఏడు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) , సశాస్త్ర సీమా బల్ (SSB)కి ఒక్కొక్కరు ముగ్గురు, బోర్డర్ సెక్యూరీ ఫోర్సు (BSF)కి ఇద్దరు. చొప్పున ఎన్నికయ్యారు.
ఈ మేరకు శౌర్య పోలీసు పతకం, విశిష్ట సేవలకుగానూ రాష్ట్రపతి పోలీసు పతకం, ప్రతిభ కనబరిచిన పోలీసు పతకం పొందిన సిబ్బంది పేర్లతో కూడిన జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
189 శౌర్య పురస్కారాలలో, జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలో వారి సాహసోపేతమైన చర్య కోసం 134 మంది సిబ్బందిని, లెఫ్ట్ వింగ్ తీవ్రవాద (LWE) ప్రభావిత ప్రాంతాల్లో వారి ధైర్యసాహసాలకు 47 మంది మరియు ఈశాన్య ప్రాంతంలో ఇదే విధమైన ప్రవర్తనకు ఒక సిబ్బందిని ప్రదానం చేస్తున్నారు. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో 10 మంది ధైర్యసాహసాలు, ఢిల్లీకి 3, జార్ఖండ్‌కు 2, మధ్యప్రదేశ్‌కు 3, మహారాష్ట్రకు 7, మణిపూర్‌కు 7, ఉత్తరప్రదేశ్‌కు 1 పోలీసు మెడల్స్ లభించాయి.
Government of India has conferred 18 medals to ITBP personnel on Republic Day 2022-3 Police Medal for Gallantry, 3 President’s Police Medal for Distinguished Service and 12 Police Medal For Meritorious Service pic.twitter.com/awX3RQ4nh1
— ANI (@ANI) January 25, 2022