దివ్యాంగులకు రూ. 90 లక్షల విలువైన వస్తువుల పంపిణీ: మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ (CLiC2NEWS): మంత్రి సత్యవతి రాథోడ్ దివ్యాంగులకు స్కూటీలను, ల్యాప్టాప్లు స్మార్ట్ఫోన్లు అందించారు. మహాబూబాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు రూ. 90 లక్షల విలువైన వస్తువులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ , ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిపి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ బిందు, వికలాంగుల సహకార సంస్థ ఛైర్మన్ వాసుదేవరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన రెడ్డి పాల్గొన్నారు.