ఫిబ్ర‌వ‌రి 1 నుంచి విద్యా సంస్థ‌లు పునఃప్రారంభం: మంత్రి స‌బిత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌లను పునః ప్రారంభించాల‌ని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో ని విద్యాసంస్థ‌ల‌ను అన్నింటిని ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్ల‌డించారు. విద్యాసంస్థ‌ల్లో క‌రోనా నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని మంత్రి ఆదేశించారు.

పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. తెలంగాణ స‌ర్కార్ గ‌త డిసెంబ‌రు 8 నుంచి విద్యా సంస్థ‌ల‌కు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించింది. కానీ క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో విద్యాశాఖ సిఫార‌సు మేర‌కు ఈ నెల 31 వ‌ర‌కు సెల‌వులను పొడిగించింది. కాగా మొత్తంగా క‌రోనా కేసులు త‌గ్గుతుండ‌టంతో ఫిబ్ర‌వ‌ర 1 నుంచి విద్యా సంస్థ‌ల‌ను రీ ఓపెన్ చేయాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది.

Leave A Reply

Your email address will not be published.